Mar 22,2023 00:37
డిక్లరేషన్‌ తీసుకుంటున్న నూతన కార్యవర్గం

ప్రజాశక్తి-రేపల్లె: రేపల్లె న్యాయవాదుల సంక్షేమ సంఘం 2023-24 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి, సీనియర్‌ న్యాయవాది జి ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. స్థానిక బార్‌ అసోసియేషన్‌ హాల్లో జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఆయన ప్రకటించారు. అధ్యక్షుడుగా కేశన వెంకట గోపాలరావు 72 ఓట్ల మెజారిటీ, స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ స్థానంలో దివి శ్రీనివాసహరికుమార్‌ 103 ఓట్లతో గెలుపొందినట్లు, వైస్‌ ప్రెసిడెంట్‌ మెండు వెంకట సుబ్బారావు, జనరల్‌ సెక్రటరీకి ఎన్‌ పోతురాజు, జాయింట్‌ సెక్రటరీకి కేజీఎల్‌ శ్రీనివాసరావు, లైబ్రేరియన్‌ మోర్ల కృష్ణారావు, ట్రెజరర్‌ టీఎస్‌ దీనరాజ్‌, మహిళా రిప్రజంటేటివ్‌గా కె శ్రీవాణి, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా పీజే ప్రకాష్‌, యెండూరి రాజేష్‌, ఎసీఎం రబ్బాని, యార్లగడ్డ ధర్మతేజ, గుమ్మడి కుమార్‌బాబు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం 2023-24 సంవత్సరానికి గాను ఏకగ్రీవంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగినందుకు సభ్యులకు ప్రశాంత్‌ కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదుల సమస్యలు పరిష్కరించేందుకు నూతన కార్యవర్గ సభ్యులు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అనంతరం వారికి డిక్లరేషన్లో పత్రాలు అందజేశారు.