Nov 24,2021 09:04

న్యూఢిల్లీ : మోడీ సర్కార్‌ మరోసారి ప్రైవేటు రాగం తీస్తోంది. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే లక్ష్యంతో నవంబర్‌ 29 నుండి ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లో బ్యాంకింగ్‌ చట్టాల (సవరణ) బిల్లు 2021 తీసుకురానున్నట్లు సమాచారం. ఈ సెషన్‌లో ప్రవేశపెట్టడానికి షెడ్యూల్‌ చేసిన 26 బిల్లుల జాబితాలో ఇది కూడా ఉంది. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలంటే. 1970, 1980లో బ్యాకింగ్‌ కంపెనీల (స్వాధీనం, అండర్‌ టేకింగ్‌ బదిలీ) చట్టాలను సవరించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ.1.75 లక్షల కోట్లను ఆర్జించేందుకు ప్రభుత్వం చేపట్టిన పెట్టుబడుల ఉపసంహరణ డ్రైవ్‌లో భాగంగా.. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. ఈ ఏడాది పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రకటించిన సంగతి విదితమే.