
కారణం ఏదైనా కావొచ్చు
మరణం నేలపై వాలింది
రెండు తుపాకుల యుద్ధం
దండకారణ్యంలో దారుణం
ఊపిరి పోసుకుంది
ఓ వైపున భద్రతా బలగాలు
మరోవైపున మావోయిస్టుల
బలగాల మధ్య
పోటాపోటీగా భీకరమైన యుద్ధమే!
తీవ్ర గాయాలతో ఆసుపత్రికి
రక్తసిక్త మరణాలతో మార్చురీకి
విషమ పరిస్థితుల్లో చికిత్సకి
హుటాహుటిన తరలింపు!
ఆపరేషన్ మెరుపు రూపంలో
గుట్టల పైనుంచి తుపాకుల మోత
ఎదురు కాల్పుల పోరాటంలో
ఎన్కౌంటరుల కోతతో
చత్తీస్‌గఢ్ సంచలన యుద్ధక్షేత్రమే!
సంయుక్త కూంబింగ్ ఫెయిల్‌తో
జవాన్లు తీవ్రంగా నేలకొరిగారు
బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు
పోలీసుల ఆయుధ సామగ్రి
మటుమాయం
లైట్ మెషిన్‌గన్స్ వాడకం
అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లు
అత్యాధునిక రాకెట్ల వినియోగం
రక్తపాతం అవనిపై ముగ్గులు వేసింది
ప్రాణ త్యాగాల బెర్తులపై
ఉరేగింపూ లేని ఒంటరి ఎడారిలా!
స్మశానవాటికకు తరలింపు
ఆకళింపు చేసుకోలేని తెగింపు
శాంతి సామరస్యాలకు విఘాతం
అభివృద్ధికి ఆటంకం కల్గించేలా వుంది.
- పగిడిపల్లి సురేందర్ పూసల
సెల్ : 80748 46063