May 14,2022 10:27

ముదినేపల్లి (ఏలూరు) : ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లిలోని రోడ్డు విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ రాజుకొని ఒకరిపైఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన వ్యక్తి శనివారం ఉదయం మృతి చెందాడు. శుక్రవారం రోడ్డు విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వర్రె నాగేంద్ర (35), అరుగుల మహేష్‌ (27)పై ఇర్ఫాన్‌ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగేంద్ర ఈరోజు ఉదయం మృతి చెందాడు. మహేష్‌ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుడు నాగేంద్ర మాలమహానాడు జిల్లా అధ్యక్షుడుగా ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.