Jan 12,2021 18:14

సిడ్నీ : టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్‌ మూడో రోజు ఆటలో గాయపడిన సంగతి తెలిసిందే. ఎడమ చేతి బొటన వేలికి గాయం చేసుకున్న జడేజా.. బ్రిస్బేన్‌ వేదికగా 15 నుంచి జరిగే చివరి టెస్ట్‌ సహా త్వరలో భారత్‌లో ఇంగ్లండ్‌తో జరగబోయే తొలి రెండు టెస్ట్‌లకూ దూరమయ్యాడు. అయితే మంగళవారం జడేజా బొటనవేలికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. సర్జరీ అనంతరం చేతికి పట్టితో ఉండగా తీసిన ఫొటోను జడేజా తన ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. 'కొద్ది రోజులు ఆటకు దూరంగా ఉంటా. చేతివేలికి ఈరోజు జరిగిన శస్త్రచికిత్స పూర్తైంది. త్వరలోనే రెట్టించిన బలంతో తిరిగొస్తా' అంటూ పేర్కొన్నాడు. జడేజా ట్వీట్‌పై బిసిసిఐ స్పందిస్తూ.. మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది.