Oct 03,2022 23:36
గుంతలు పడి అధ్వానంగా ఉన్న రోడ్డు

ప్రజాశక్తి-సంతమాగులూరు: మండలంలోని కొమ్మాలపాడు, పరిటాలవారిపాలెం గ్రామాల మధ్య ఆర్‌అండ్‌బి రహదారి మోకాళ్లలోతు గుంతలతో అధ్వానంగా మారింది. కొమ్మాలపాడు నుంచి మామిళ్లపల్లి, కుందుర్రు, పరిటాలవారిపాలెం, గ్రామం వరకు ఉన్న 9 కిలోమీటర్ల రహదారి పూర్తిగా శిథిలావస్థకు చేరింది. అంతేగాక ఈ రహదారిపై నిత్యం చిలకలూరిపేట నుంచి మార్టూరు మీదుగా బల్లికురవ, కొమ్మాలపాడు, కుందుర్రు, మీదుగా పరిటాలవారిపాలెం వరకు ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో తిరుగుతుంటాయి. రహదారి మొత్తం అడుగు అడుగున మోకాళ్ల లోతు గుంతలు ఏర్పడడంతో బస్సులు, ఆటోలు, మోటార్‌ సైకిలిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాక రాత్రులందు వాహనాలు గుంతల్లోపడి క్షతగాత్రులు అవుతున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని ప్రయాణికులు, ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.