Aug 03,2022 13:45

న్యూఢిల్లీ :  75వ స్వాతంత్య్ర వేడుకల సందర్బంగా..తమ సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ పిక్‌గా జాతీయ జెండాను పెట్టాలన్న ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఆజాదీకి అమృత్ మ‌హోత్స‌వ్‌లో భాగంగా హ‌ర్ ఘ‌ర్ తిరంగా సంబ‌రాల‌ను కేంద్రం నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. దీనిలో భాగంగా ఆగ‌స్టు 2వ తేదీ నుంచి 15వ తేదీ వ‌ర‌కు సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లో జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్‌గా వాడాల‌ని మోడీ కోరారు. ఇప్పటికే పలువురు  ఆ పిలుపును శిరస్సా వహించారు.  మోడీ పిలుపు మేరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం తన ట్విట్టర్ ప్రొపైల్  పిక్ మార్చారు.  అయితే అందులో  దేశ తొలి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ.. జాతీయ జెండాను పట్టుకున్న ఫోటోను రాహుల్ ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నారు. ఈ త్రివ‌ర్ణ ప‌తాకం దేశానికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని, ఇది భార‌తీయుడి గుండె అని రాహుల్ త‌న ట్వీట్‌లో తెలిపారు.