Oct 05,2022 11:48

ప్రజాశక్తి-పాలకొల్లు : పాలకొల్లులో విజయ దశమి సందర్భంగా భారీ వర్షం పడింది. దీనితో భక్తులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పట్టణంలోని వివిధ ప్రాంతాలలో దేవాలయాలు వద్ద భక్తులు తడిచా ముద్దయ్యారు. యడ్ల బజార్, పెద్ద గోపురం, పెద్ద సాయిబాబా, వాసవి కల్యాణ మండపంల వద్ద విజయ దశమి సందర్భంగా అమ్మవారు వివిధ అలంకరణలతో ప్రధాన ఆకర్షణగా ఉన్నారు. దీనితో ఆలయాల వద్ద రద్దీ ఎక్కువగా ఉంది. వర్షం వలన భక్తులు ఇక్కట్లు పడుతున్నారు.