Jun 23,2022 15:37

ప్రజాశక్తి-కైకలూరు : రానున్న వర్షాకాలం సీజన్ లో ప్రజలు వ్యాధుల బారిన పడకుండా అధికారులు ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని మండల పరిషత్ అధ్యక్షులు అడవి వెంకట కృష్ణ మోహన్ తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో వెంకటరత్నం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ జగన్ అన్న స్వచ్చా సంకల్పం అక్టోబర్ రెండు నుంచి ప్రారంభం అవుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మొక్కలు పెంచడం, పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఉంటుంద న్నారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జగనన్న ఆశయాల మేరకు పని చేసి గ్రామాల్లో అభివృద్ధి ని సాధించాలన్నారు. నాడు - నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ వచ్చిందన్నారు. అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేసి అభివృద్ధిని సాధించాలన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మహమ్మద్ జహీర్, సర్పంచుల సంఘం అధ్యక్షులు బలరామరాజు, తాసిల్దార్  రంగారావు, పీఆర్ డీఈ సురేష్, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.