
హైదరాబాద్ : టాలీవుడ్లో షూటింగ్స్ నిలిచిపోయాయి. ఈ బంద్‌కు కారణం ఓటిటిలు, నటీనటులు, హీరోల రెమ్యూనరేషన్ ప్రధాన కారణమని నిర్మాతలు చెబుతున్నారు. ప్రేక్షకులు ధియేటర్లకు రావడం లేదని, సినిమాపై పెట్టిన ఖర్చు కూడా రావడం లేదంటూ 'యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్', 'తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి' షూటింగ్‌లకు పేకప్ చెప్పాయి. ఈ క్రమంలో షూటింగ్స్ బంద్‌పై కాంట్రవర్సీ కింగ్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ... సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తాజాగా ఓ తెలుగు ఛానల్‌తో ముచ్చటించిన ఆయన.. టాలీవుడ్లో ఈ పరిస్థితి రావడానికి దర్శకుడు జక్కన్న రాజమౌళి కారణమంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. టాలీవుడ్‌కు అసలు శత్రవులు దర్శకుడు రాజమౌళి, యూట్యూబ్ చానళ్లని.. ఓటీటీలు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'ప్రస్తుతం ప్రేక్షకులు షాట్ వీడియోలకు అలవాటు పడ్డారు. ఎక్కువగా యూట్యూబ్‌ని ఫాలో అవుతున్నారు. థియేటర్లో రెండు గంటల పాటు ఓపిగ్గా సినిమా చూడాలంటే రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ లేదా కేజీయఫ్ లాంటి సినిమాలు మాత్రమే తీయాలి' అని వ్యాఖ్యానించారు.
<
థియేటర్ల ప్రాబ్లెమ్ , ఓటిటి లు కాదు ..అసలు శత్రువులు @ssrajamouli and యూట్యూబ్ https://t.co/yxp8o4QEYh
— Ram Gopal Varma (@RGVzoomin) August 3, 2022