
బోయపాటి శ్రీను, ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'రాపో 20'. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. తాజాగా అభిమానుకు రామ్ అప్‌డేట్ అందించాడు. 'మొత్తానికి 24 రోజులపాటు కష్టపడి స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ పూర్తి చేశాం. ఇది క్లైమాక్స్ కాదు..' అంటూ ట్వీట్ చేశాడు రామ్. చిత్రాన్ని అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో గ్రాండ్‌గా విడుదల కానుంది.