Oct 26,2021 20:09

ప్రకాశ్‌ రాజ్‌ ప్రధాన పాత్రలో కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'రంగ మార్తాండ'. మరాఠిలో సూపర్‌ హిట్‌గా నిలిచిన 'నటసామ్రాట్‌' చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి తాజాగా ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది. ఈ మూవీకి చిరంజీవి గొంతు ఇచ్చినట్లు డైరెక్టర్‌ కృష్ణవంశీ వెల్లడించారు. ఇందులోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రకాశ్‌ రాజ్‌తో పాటు రమ్యకృష్ణ కీలకపాత్ర పోషిస్తుండగా.. అనసూయ భరద్వాజ్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, శివాత్మిక రాజశేఖర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.