Apr 20,2021 22:04

స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న తహశీల్దార్‌ దంపతులు

ప్రజాశక్తి - జూపాడుబంగ్లా: తర్తూరు గ్రామంలో శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారికి రెవెన్యూ అధికారులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆనవాయితీ ప్రకారం గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి మేళతాళాలతో తహశీల్దార్‌ నరసింహారావు దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్లగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచి నాగిరెడ్డి, ఇఒ వెంకటరమణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.