Oct 13,2021 21:24

కెరీర్‌లో 10వ సారి హ్యాట్రిక్‌ గోల్స్‌
అల్‌గార్వ్‌: పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ మ్యాచుల్లో 10వ సారి హ్యాట్రిక్‌ గోల్స్‌ కొట్టి ఈ రికార్డును నమోదు చేశాడు. మంగళవారం రాత్రి జరిగిన ఫిఫాా2022 ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌ పోటీల్లో లగ్జెంబర్గ్‌పై రొనాల్డో హ్యాట్రిక్‌ గోల్స్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్‌ జట్టు 5-0 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది. ఇక రొనాల్డో 182 మ్యాచుల్లో 115వ అంతర్జాతీయ గోల్స్‌ నమోదు చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటికే అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఘనతను సొంతం చేసుకున్న రొనాల్డో.. తాజాగా అత్యధిక కెరీర్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌ సంఖ్యనూ 58కు పెంచాడు.