Jul 03,2022 22:19

రోడ్డులో నిలచిన నీటిలో వరినాట్లు వేస్తున్న నాయకులు

ప్రజాశక్తి, పెనుకొండ : పట్టణంలోని నారాయణమ్మ కాలనీ నుండి కోనాపురానికి వెళ్లే రోడ్డును మరమ్మతులు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు ఆదివారం వినూత్న నిరసన చేపట్టారు. వర్షపు నీటితో నిల్వ ఉన్న రోడ్లపై వరి నాట్లు నాటి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్‌ నాయకులు హరి మాట్లాడుతూ పెనుకొండ నుండి కోనాపురం వెళ్లే రోడ్డు గుంతల మయంగా తయారై అధ్వానంగా మారిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే నిత్యం ఈ రహదారి మీద వెళుతుంటారని ఆయనకు ఈరోడ్డు దుస్థితి కన్పించలేదా అని ప్రశ్నించారు. పట్టణంలోని రోడ్లన్నీ మరమ్మతు చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి రమేష్‌, తిప్పన్న, సిఐటియు మండల కార్యదర్శి బాబావలి, నరసింహులు, వజ్రం నాగప్ప, కెవిపిఎస్‌ నాయకులు గంగాధర్‌, ఘనగిరి జన చైతన్య వేదిక నాయకులు రాజశేఖర్‌ రెడ్డి, సిఐటియు నాయకులు తిప్పన్న, క్రిష్ణప్ప తదితరులు పాల్గొన్నారు.