Feb 11,2021 22:58

వినతిపత్రం అందిస్తున్న నాయకులు

ప్రజాశక్తి- పెద్దాపురం 'స్థానిక డైలీ మార్కెట్‌ సెంటర్‌ నుంచి వెంకటేశ్వరస్వామి గుడి సెంటర్‌ వరకు వెంటనే మెయిన్‌ రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభించాలని కోరుతూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కమిషనర్‌ జె.సురేంద్రకు గురువారం వినతిపత్రం అందించారు.' ఈసందర్భంగా ఆ పార్టీ పట్టణ కార్యదర్శి నీలపాల సూరిబాబు మాట్లాడుతూ ఐదేళ్లుగా ఈ మెయిన్‌ రోడ్డు ధ్వంసమై ప్రజలు, వ్యాపారులు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. అనేకసార్లు సిపిఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు చేపట్టామన్నారు. ఇంతవరకు మున్సిపల్‌ అధికారులు స్పందించలేదన్నారు. రోడ్డు నిర్మాణం పనులు వెంటనే చేపట్టకపోతే సిపిఎం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో నాయకులు డి.సత్యనారాయణ, జి.సత్తిబాబు, డి.క్రాంతి కుమార్‌ పాల్గొన్నారు.