Sep 27,2021 15:52

ప్రజాశక్తి- తనకల్లు
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన అనంతరపురం జిల్లాలోని తనకల్లు మండలంలో సోమవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం తనకల్లు మండలం తనకల్లు సమీపంలో ఎన్‌హచ్‌ 47 జాతీయ రహదారి పక్కన నల్ల చెరువు నుండి డి ఓబులేసు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా అదుపు తప్పి కిందపడిపోయాడు. ఈ ఘటనలో ఓబులేసు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి.