Jan 15,2022 15:56

బనశంకరి (బెంగళూరు): సన్నమ్మ సూపర్‌స్టార్‌ రియాలిటీ షో పోటీదారైన ఆరేళ్ల బాలిక సమన్వి రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ఈఘటన గురువారం సాయంత్రం బెంగళూరులో చోటు చేసుకుంది. అమృతానాయుడు, రూపేశ్‌నాయుడు దంపతులు కనకపురరోడ్డులోని లిబర్టీ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె సమన్వి(6) రియాలిటీ షోలో పోటీదారుగా ఉంది. గురువారం సాయంత్రం తల్లి అమృతానాయుడు, సమన్విలు వాజరహళ్లిలో షాపింగ్‌కు స్కూటీపై వెళ్లి వస్తుండగా వెనుక నుంచి టిప్పర్‌ ఢకొీంది.దీంతో కిందపడిన సమన్విపై లారీ చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అమృతానాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. కుమారస్వామి లేఔట్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. బనశంకరి స్మశానవాటికలో శుక్రవారం సమన్వి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ డ్రైవర్‌ మంచేగౌడను అరెస్ట్‌ చేసినట్లు పశ్చిమ విభాగ ట్రాఫిక్‌ డీఎస్పీ కుల్‌దీప్‌ కుమార్‌ జైన్‌ తెలిపారు. సమన్విమృతికి శాండిల్‌వుడ్‌ నటులు కిచ్చాసుదీప్‌, తారాఅనురాధ, అనుప్రభాకర్‌, సృజన్‌ లోకేశ్‌ సంతాపం వ్యక్తం చేశారు.