Jan 15,2022 16:32

ప్రజాశక్తి-పలమనేరు : పలమనేరు నియోజకవర్గంలో రోడ్ల దుస్థితికి మాజీమంత్రి అమరనాథ రెడ్డే కారణమని ఎమ్మెల్యే వెంకటే గౌడ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎన్నికల ముందు సుమారు 123 కోట్ల రూపాయలతో 113 రోడ్ల పనులకు టెండర్లు పిలిచి,  పనులు ప్రారంభించి అలాగే వదిలేశారని అన్నారు. శ్రీనివాస కన్స్ట్రాక్షన్ పేరుతో బినామీ కంపెనీ ద్వారా టెండర్లు దక్కించయకుని ఓడిపోయే సరికి పనులు చేయకుండా వదిలేసారన్నారు. పనులు పూర్తి చేయకుంటే అమరనాథ రెడ్డి ఇంటిముందు ప్రజలతో కలిసి ధర్నా చేస్తామని హెచ్చరించారు. సోమవారం అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్ లకు, ఎంపిడీలకు వినతిపత్రాలు అందివ్వాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.