Nov 25,2021 10:32

అనంతపురం : అక్కడ రోడ్డుపై చేపలు గుంపులు గుంపులుగా ఈదుతున్నాయి. వందలాది మంది రోడ్డుపైకి వచ్చి చేపలు పట్టుకొని ఇంటికి వెళ్లిపోతున్నారు. ఇది వెటకారంగా చెప్పేది కాదు. నిజంగా జరుగుతున్నది. అనంతపురం జిల్లాను భారీ వరదలు ముంచెత్తాయి. గత పదేళ్లలో ఎన్నడూ లేనంత వరదలు వచ్చాయి. దీంతో జిల్లాలో ఉన్న పిల్ల కాలువ దగ్గర నుంచి వాగులు, వంకలు.. పొంగిపొర్లాయి. దీంతో కాల్వలు, చెరువుల్లోనే కాదు రోడ్లపై కూడా చేపల జాతర సాగుతోంది. శింగనమల చెరువు వద్ద చేపల కోసం జనాలు రోడ్లపై పరుగులు తీస్తున్నారు. చాలా తేలికగా క్వింటాళ్ల కొద్దీ చేపలను రోడ్లపైనే పట్టుకుపోతున్నారు. సోషల్‌ మీడియాలో వీటికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారాయి. ఈ సందడి చూసిన నెటిజన్లు సైతం అవాక్కై చూస్తున్నారు. గత పదేళ్లలో ఎన్నడూ లేనంత వరదలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు.