Sep 27,2021 16:33

న్యూఢిల్లీ :  సహోద్యోగిపై అత్యాచారానికి పాల్పడిన భారత వాయు సేన (ఐఎఎఫ్‌) అధికారిని కోయంబత్తూర్‌లో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చత్తీస్‌గఢ్‌కు చెందిన 29 ఏళ్ల లెఫ్టినెంట్‌ కోయంబత్తూర్‌ ఎయిర్‌ఫోర్స్‌ కాలేజీలో శిక్షణ కోసం వెళ్లాడు. పదిరోజుల క్రితం లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మీడియా తెలిపింది. కోయంబత్తూర్‌ సెంట్రల్‌లోని మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, ఐపిసి సెక్షన్‌ 376 కింద ఆదివారం తెల్లవారు జామున అధికారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. ఆదివారం ఉదయం నిందితుడిని మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచిన అనంతరం ఉడుమలైపేట సబ్‌జైలుకు తరలించారు. ఐఎఎఫ్‌ అధికారిని కోయంబత్తూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేయలేరని నిందితుని తరపు న్యాయవాది అఫిడవిట్‌ దాఖలు చేశారు. అయితే పోలీసులు కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని మెజిస్ట్రేట్‌ని కోరారు.