Aug 05,2022 12:14

రష్మిక మందన్న క్రేజ్‌..పుష్ప తర్వాత అమాంతం పెరిగిపోయింది. బాలీవుడ్‌లో కూడా పలు ప్రాజెక్టులు చేస్తున్న ఈ కన్నడ కస్తూరీ.. ఇప్పుడు భారీగా రెమ్యూనరేషన్‌ పెంచేశారని టాక్‌. పుష్ప తర్వాత ఆమెకు ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ కూడా విపరీతంగా పెరిగిపోయారు. ఆమెను సోషల్‌ మీడియాలో ఫాలో అవుతున్న వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. సుమారు ఇన్‌స్టాలో ఆరు మిలియన్ల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ సైతం ఈ మోస్ట్‌ డిమాండెడ్‌ హీరోయిన్‌ కోసం వేచి చూస్తున్నారట. దీంతో ఈ క్రేజ్‌ని, డిమాండ్‌ను క్యాష్‌ చేసుకోవాలని రష్మిక భావిస్తోందట. పుష్ప విడుదలకు ముందు ఆమెకు రూ. 2 కోట్లు తీసుకోగా.. ఇప్పుడు రూ. 3 కోట్లు డిమాండ్‌ చేస్తున్నారట. ఇక బాలీవుడ్‌ సినిమాలకైతే రూ. 4 కోట్లు ముట్టజెబితే కానీ.. ప్రాజెక్టులకు ఓకే చేయడం లేదని వినికిడి. ప్రస్తుతం ఆమె చేతిలో రణబీర్‌ కపూర్‌-సందీప్‌ వంగా యానిమల్‌లో ఉండగా.. పుష్ఫ పార్ట్‌ 2కి కూడా రూ. 4 కోట్లు పేమెంట్‌ తీసుకున్నారని తెలుస్తోంది. మరి ఈ రెమ్యునేషన్‌పై వార్తలపై రష్మిక ఏమంటారో వేచి చూడాలి.