Oct 18,2020 22:21

బిటి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్సీలు

ప్రజాశక్తి - ఉయ్యాలవాడ :మండలంలోని ఆర్‌.పాంపల్లె, ఆర్‌.పాంపల్లె-కొండపల్లి గ్రామానికి 8.5 కిలోమీటర్ల మేర బిటి రోడ్డు నిర్మాణ పనులు రూ. 5.72 కోట్లతో చేపడుతున్నట్లు నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందారెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. ఆదివారం రోడ్డు నిర్మాణ పనులకు వారు భూమి పూజ చేసి ప్రరాంబించారు. వారు మాట్లాడుతూ వాగు వంతెన ఎత్తు పెంచుతూ నూతన వంతెన నిర్మిస్తామని చెపాపరు. పంచాయతీ రాజ్‌ ఎస్‌ఈ సుబ్రమణ్యం, ఈఈ ఓబుల్‌ రెడ్డి, డిఈ సుబ్బరాయుడు, ఏఈ కరీం, వైసిపి మండల కన్వీనర్‌ బుడ్డా చంద్రమోహన్‌ రెడ్డి, పోచా వెంకట్‌ రెడ్డి, పోచా రాధాకృష్ణారెడ్డి, నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.