Oct 03,2022 23:22

ఆర్థిక సాయం అందజేస్తున్న జడ్‌పిటిసి దద్దాల నారాయణ

వెలిగండ్ల : మండల పరిధిలోని హుస్సేన్‌పురం పంచాయతీ పరిధిలోని పద్మాపురం ఎస్‌సి కాలనీకి చెందిన గూడూరి మరియమ్మ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. ఈ విషయం గురించి తెలుసుకున్న గ్రామ సర్పంచి మంజు భార్గవి భర్త హనుమంతునిపాడు జడ్‌పిటిసి దద్దాల నారాయణ ఆమె ఆపరేషన్‌ కోసం రూ.10వేల ఆర్థిక సాయాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా మరియమ్మ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, సర్పంచి మంజుభార్గవి, జడ్‌పిటిసి దద్దాల నారాయణ దంపతులకు అభినందనలు తెలిపారు.