Jul 29,2021 23:44

అర్బన్‌ హెల్త్‌ కేర్‌ సెంటర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మేయర్‌ హరివెంకటకుమారి, ఎమ్మెల్యే వాసుపల్లి

కలెక్టరేట్‌ : దక్షిణ నియోజకవర్గంలో రూ.3.20 కోట్లతో నాలుగు చోట్ల ఒక్కొక్కటి రూ.80 లక్షలతో వైఎస్‌ఆర్‌ అర్బన్‌ హెల్త్‌ కేర్‌ సెంటర్లను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్‌ తెలిపారు. నియోజకవర్గంలోని 41వ వార్డు పరిధి సుబ్బలక్ష్మి నగర్‌లో నిర్మించనున్న అర్బన్‌ హెల్త్‌ కేర్‌ సెంటర్‌ కు గురువారం జివిఎంసి మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. మేయర్‌ హరి వెంకట కుమారి మాట్లాడుతూ, సెంటర్‌ నిర్మాణ పనులను వెంటనే చేపట్టి త్వరగా పూర్తిచేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డు కార్పొరేటర్‌ కోడిగుడ్ల పూర్ణిమ, జోనల్‌ కమిషనర్‌ మల్లయ్య నాయుడు, ఇఇ పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.