Oct 16,2020 21:20
రూ.6వేలకే థాంప్సన్‌ స్మార్ట్‌ టీవిలు

హైదరాబాద్‌ : యూరప్‌ కన్సూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌ థాంప్సన్‌ భారత మార్కెట్లోకి అందుబాటు ధరల్లో నూతన స్మార్ట్‌ టీవిలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌ అక్టోబర్‌ 16-21 తేదిల్లో నిర్వహిస్తున్న బిగ్‌ బిలియన్‌ డేస్‌లో భాగంగా బిగ్‌ సేవ్‌ ఆన్‌ బిగ్గర్‌ టీవి ఆఫర్లను అందిస్తున్నట్లు థాంప్సన్‌ తెలిపింది. ఎస్‌బిఐ క్రెడిట్‌ కార్డ్‌దారులకు అదనంగా తమ టివిలపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించింది. వాషింగ్‌ మెషీన్లు రూ.6,499 నుంచి ప్రారంభం అవుతాయని తెలిపింది. ఈ పండుగ సీజన్‌లో మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా తమ ఉత్పత్తులను ఆవిష్కరించినట్లు థాంప్సన్‌ టీవి, ఇండియా బ్రాండ్‌ లైసెన్సీ ఎస్‌ఎస్‌పిఎల్‌ సిఇఒ అవ్‌నీత్‌ సింగ్‌ మార్వా తెలిపారు. గత మూడు, నాలుగు నెలల్లో ఆన్‌లైన్‌ కొనుగోలుదారుల సంఖ్య కొత్తగా 20 శాతం పెరిగిందన్నారు. ఈ దోరణీలు తమకు మరింత విశ్వాసాన్ని కల్పిస్తున్నాయని మార్వా పేర్కొన్నారు. ఈ పండగ సీజన్‌లో 2 లక్షల యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.