Oct 14,2021 21:54

బాధితులకు చెక్కు అందజేస్తున్న దృశ్యం

అనంతపురం కార్పొరేషన్‌ : అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ నందు ఇంజనీరింగ్‌ విభాగంలో వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న అజ్మతుల్లా అనారోగ్య కారణాలతో ఇటీవల మృతి చెందారు. మృతుడి కుటుంబానికి ఇంజనీరింగ్‌ విభాగంలోని 309 మంది కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ తమ ఒక రోజు వేతనం రూ.466 అందరి నుంచి వసూలు చేశారు. గురువారం కార్పొరేషన్‌ కార్యాలయ ఆవరణలో కమిషనర్‌ పివిఎస్‌.మూర్తి చేతుల మీదుగా మృతుడు అజ్మతుల్లా భార్య వహీదాకు అందజేశారు ఈ కార్యక్రమంలో డీఈఈ చంద్రశేఖర్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ బాబావలి, సిబ్బంది, సిఐటియు మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం నగర అధ్యక్షుడు ఎటిఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.