Nov 25,2022 15:43

ప్రజాశక్తి-చింతకుంట్ల : ఉద్యోగ కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రలోని బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వన తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్ ల రద్దులకై ఉద్యోగ కార్మికులు ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని సిఐటియు జిల్లా నాయకులు సయ్యద్ అనీఫ్ పిలుపునిచ్చారు. హనుమంతునిపాడు మండల కేంద్రంలో సిఐటియు నాయకులు చింతకుంట్ల ఏసు అధ్యక్షతన నాలుగు లేబర్ కోడ్ లు వీటి యొక్క ప్రమాదం అను అంశంపై ఓపెన్ స్టడీ సర్కిల్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీరు మాట్లాడుతూ స్వాతంత్ర ముందు నుండి ఇప్పటివరకు అనేక ఉద్యమాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి కార్మికులు ఉద్యోగులు వాళ్ళ హక్కుల రక్షణ కోసం పని గ్యారెంటీ కోసం వేతన చట్టం కోసం సామాజిక భద్రత కోసం చట్టాలు సాధించుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని విలీనం చేసి నిర్వీర్యం చేసేందుకు మొత్తం చట్టాలను నాలుగు కోడలుగా విభజించారని భవిష్యత్తులో ఉద్యోగ కార్మికుల హక్కులపై ఇవి దాడి చేయబోతున్నాయని ఈ ప్రమాదాన్ని నివారించుటకు ఉద్యోగ కార్మికులందరూ కలిసికట్టుగా ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ కార్మిక వర్గం నిరంతరం చైతన్యవంతంగా ఉండాలని జరుగుతున్నటువంటి మార్పులు పరిపాలకుల యొక్క ఎత్తుగడలు తెలుసుకుంటూ ఉండాలని తమ ఉనికికే ప్రమాదం వచ్చే పద్ధతిలో ప్రభుత్వాలు నిర్ణయాలు చేస్తే కార్మికుల లోకం ఉప్పెనలా లేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఉస్తేల నారాయణ, రవి, మహమ్మద్, గురవయ్య, తాపీ వర్కర్స్ యూనియన్ నాయకులు అండ్ కనకరాజు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గాలిమోటు ఏసేపు పోతురాజు, మంగయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.