Sep 29,2022 10:17

ప్రజాశక్తి-నల్లచెరువు: ట్రాక్టర్ ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి చెందింది. నల్లచెరువు మండలం ఓరువాయి( గ్రామం)సానేవారి పల్లి గ్రామానికి చెందిన పెద్దరంగోళ్ల యల్లప్ప కుమార్తె ప్రేమలత(9)కు ఆరోగ్యం బాగా లేదని నల్లచెరువు తీసుకొని వెళ్లారు. వైద్యం చేయించుకుని ద్విచక్ర వాహనంలో స్వగ్రామానికి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంజనేయస్వామి మిట్ట దగ్గర వెనుక నుండి గుర్తు తెలియని ట్రాక్టర్ ఢీకొనగా చిన్నారి అక్కడికక్కడే మృతి చెందినది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు  విచారణ చేపట్టారు.