Mar 17,2023 21:47
  • బులోర వాహనం, ఆటో ఢీ
  • మరో ఐదు మంది గాయాలు
  • చిన్నారి పరిస్థితి విషమం

ప్రజాశక్తి-బత్తలపల్లి: కనురెప్ప పాటుతో ఘోర ప్రమాదం జరిగిన సంఘటన అనంతపురం జిల్లా బత్తలపల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు పోలీసుల కథనం మేరకు.. ధర్మవరం వైపు నుంచి బులోరా వాహనం బత్తలపల్లి వైపు వస్తుంది. బత్తలపల్లిలో ఆటో ప్రయాణికులను  ఎక్కించుకొని ధర్మవరం  వైపు వెళుతుండగా స్థానిక తహసిల్దార్ కార్యాలయం సమీపంలోని నాగుల కట్ట వద్దకు వెళ్ళగానే రెండు వాహనాలు ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులకు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ప్రమాదము సంఘటనకు చేరుకొని వాహనాలను పక్కకు తీసుకువేసి చూడగా నలుగురు అక్కడకక్కడే ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా 108 వాహనముకు సమాచారం అందించడంతో అందులో ఓ చిన్నారితో పాటు మరో ఇద్దరిని స్థానిక ఆర్డిటి ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతులు, గాయపడిన వారి వివరాలను సేకరిస్తున్నారు. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రిలో వైద్య సేవలను అందిస్తున్నారు. అయితే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.