
హైదరాబాద్ : టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ ఆర్‌ఆర్‌ఆర్. ఈ చిత్రంలో రామ్‌చరణ్ సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించి మెప్పించారు. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. అయితే ఈ మూవీ మే 20న ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 వేదికగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 'ఆర్‌ఆర్‌ఆర్' సరికొత్త ట్రైలర్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ అడవిలో ఓ చిన్న తండా.. ఊయల ఊగుతూ చిరునవ్వులు చిందిస్తున్న చిన్నారితో ప్రారంభమవుతుంది. ఇక రామ్ - భీమ్‌ల కలయిక, బ్రిటీష్‌వారిపై యుద్ధం వంటి ముఖ్యమైన షాట్స్‌ని చూపించారు. 'ప్రతి తూటా మీద చచ్చేవాడి పేరు రాసుంటుంది. ప్రతి తుపాకీ మీద పేల్చే వాడి పేరుంటుంది', 'యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి' వంటి పవర్‌ఫుల్ డైలాగ్స్ అలరిస్తున్నాయి. అలాగే ఈ ట్రైలర్‌లో స్పెషల్ బీజిఎం ఆకట్టుకుంటోంది.