Oct 03,2022 01:21

మాట్లాడుతున్న జడ్డి పూర్ణిమాదేవి

శింగరాయకొండ: గాంధీ జయంతి సందర్భంగా కందుకూరు కోర్టు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మండల పరిధిలోని ఊళ్ళ పాలెం పంచాయతీ పరిధి రైతు భరోసా కేంద్రం సదస్సు నిర్వహించారు. సదస్సులో అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి పి. పూర్ణిమాదేవి మాట్లాడుతూ మహాత్మా గాంధీ అవలంబించిన సత్యం, శాంతి, అహింస మార్గాలే నేటి యువత అలవర్చుకోవాలన్నారు. తొలుత గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ న్యాయవాది సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు. శింగరాయకొండ ఎస్‌ఐ ఫిరోజా ఫాతిమా, న్యాయవాది బక్క మంతుల వెంకటేశ్వర్లు, ఊళ్ళ పాలెం సర్పంచి అనసూర్యమ్మ, కోర్టు సిబ్బంది శివన్నారాయణ, న్యాయ సేవ సహాయకులు పంతగాని వెంకటేశ్వర్లు , పంచాయతీ కార్యదర్శి సైదులు పాల్గొన్నారు.