
మాట్లాడుతున్న ఎస్‌ఐ
ప్రజాశక్తి -హుకుంపేట:సారా రవాణా చట్టరీత్యా నేరమని స్థానిక ఎస్సై బి.సతీష్ తెలిపారు. మండలంలో వివిధ గ్రామాల్లో గతంలో నాటు సారా కేసులో పట్టుబడిన 16మంది నిందితుతలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించి 337 లీటర్లు నాటు సారా సీజ్ చేశామని ఎస్సై చెప్పారు. పట్టుబడిని ఈ సారాను పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో ధ్వంసం చేశారు. అనంతరం స్థానిక విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ మాట్లాడుతూ, నాటు సారా క్రయ విక్రయాలు చేయడం చట్టరీత్యా నేరమని, వారి పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తే ఎనిమిది సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని ఆయన అన్నారు. యువతీ యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.