Jun 01,2023 23:36


ప్రజాశక్తి-అమలాపురం
శాస్త్రీయ దృకథాన్ని ప్రజల్లో పెంపొందించాలని జన విజ్ఞాన వేదిక నాయకులు పిలుపునిచ్చారు. జనవిజ్ఞాన వేదిక (జెవివి) డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్‌ ఈ.ఆర్‌. సుబ్రహ్మణ్యం అధ్యక్షతన గురువారం స్థానిక ఎంప్లాయిస్‌ హోస్‌లో జరిగింది.జిల్లావ్యాప్తంగా అన్ని మండలల్లోను జెవివి సభ్యత్వ క్యాంపెయిన్‌ ఈ నెలలో చేపట్టాలని, మండల, పట్టణ కమిటీల సమావేశాలు జూలైలోనూ, జిల్లా మహాసభ ఆగస్టులోను నిర్వహించాలని జిల్లా కమిటీ తీర్మానించింది.రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు రాష్ట్ర మహాసభ సెప్టెంబర్‌ 9, 10 తేదీల్లో చీరాలలో నిర్వహిస్తున్నట్లు జెవివిఇ జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యులు కెవివి.సత్యనారాయణ చెప్పారు. ప్రజల కోసం సైన్స్‌, ప్రగతి కోసం, స్వావలంబన కోసం సైన్స్‌ అనే నినాదాలతో జెవివి 35 ఏళ్లుగా పనిచేస్తుందని, జెవివి లో సభ్యులుగా చేరాలన్నారు. ఈ మేరకు పోస్టర్‌ ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా జెవివి గౌరవ అధ్యక్షులు డాక్టర్‌ ఇఆర్‌. సుబ్రహ్మణ్యం, కార్యదర్శి కెవివి.సత్యనారాయణ, బియన్‌.వెంకటేశ్వరరావు, అబ్బిరెడ్డి రామకష్ణ, కాజా మొహినుద్దిన్‌, కెవి.రమణ, డాక్టర్‌ బి.రాంప్రసాద్‌, త్రినాథకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.