Nov 26,2021 09:06

మాస్కో : రష్యాలోని సైబీరియా బొగ్గు గనుల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 52 మంది మైనర్లు, రెస్క్యూ సిబ్బంది మృతి చెందారు. రష్యాలో ఐదేళ్లలో జరిగిన అత్యంత ఘోరమైన గని ప్రమాదం ఇది. పేలుడు సంభవించిన సమయంలో మీథేన్‌ వాయువు, విషపూరిత వాయువులు ఎక్కువగా విడుదల కావడంతో ప్రాణ నష్టం అధికంగా జరిగింది. తొలుత అధికారులు 14 మంది మృతదేహాలను వెలికి తీశామని, మరో 38 మంది కోసం అన్వేషించాల్సి ఉండగా.. భద్రతా కారణాల దృష్ట్యా నిలిపివేసినట్లు చెప్పారు. అయితే వీరు ప్రాణాలతో భయటపడే అవకాశాలు లేవన్న అత్యవసర అధికారుల అన్నట్లు స్థానిక మీడియాలు పేర్కొన్నాయి. నైరుతి సైబీరియాలో కెమెరోవోలో లిస్ట్‌వ్యాజ్నాయ గనిలో సుమారు 285 మంది కార్మికులు పనిచేస్తున్నారు. గనిలో ఒక్కసారి మంటలు చెలరేగి, పొగ చుట్టుముట్టడంతో 52 మంది మృతి చెందారు.