
ప్రముఖ ఇండియన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ సిద్ధమైంది. 'సైనా' పేరుతో తెరకెక్కిన ఈ బయోపిక్ మార్చి 26న విడుదలవుతోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా టైటిల్ పాత్రలో నటించిన ఈ సినిమాను అమోల్ గుప్తా దర్శకత్వం వహించారు. భూషణ్‌కుమార్, క్రిషన్ కుమార్, సుజరు జైరాజ్, రషేష్ షా నిర్మించారు. థియేటర్స్‌లోనే విడుదల చేస్తున్నారు.