Aug 18,2022 23:08

సమావేశంలో మాట్లాడుతున్న కోరాడ రాజబాబు

ప్రజాశక్తి -భీమునిపట్నం : టిడిపి సభ్యత్వ నమోదు త్వరగా పూర్తి చేయాలని ఆ పార్టీ నియోజక వర్గ ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక చిన్నబజారులో ఉన్న పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షులు డిఎఎన్‌.రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాజబాబు మాట్లాడుతూ, పార్టీ సభ్యుత్వ నమోదుతో పాటు, ఓటరు జాబితాలో పేర్లు, ఫొటోలు ఉన్నవీ, లేనివీ సరి చూసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీటిసి మాజీ సభ్యులు సరగడ అప్పారావు, వాణిజ్య విభాగం నియోజక వర్గ అధ్యక్షులు యరబాల అనీల్‌ ప్రసాద్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షులు పతివాడ రాంబాబు, జివిఎంసి నాలుగో వార్డు అధ్యక్షులు పాసి నరసింగరావు, సంకురు భుక్త ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.