Jun 23,2021 16:09

ఆలమూరు (తూర్పు గోదావరి) : మండలంలోని సంధిపూడిలో జరుగుతున్న సచివాలయ భవన నిర్మాణ పనులను ఎంపిడివో జె.ఏ.ఝాన్సీ బుధవారం అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. సచివాలయ నిర్మాణం జాప్యానికి గల కారణాన్ని, ఇతర ఇబ్బందులను సర్పంచ్‌ను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారునికి ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ తోట భవాని వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్‌ వాసా కాశీ విశ్వనాధం, ఏపీవో వెంకటేశ్వరరావు, కార్యదర్శి సత్తిబాబు, మండల ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ శంకర్‌, నేతలు దొడ్డ సుబ్బారావు, ఎలుగుబంటి రామకృష్ణ, మోటుపల్లి వెంకన్న, శాఖల సిబ్బంది పాల్గొన్నారు.