Jul 29,2021 23:02

ఎంపిడిఒకు వినతి పత్రం సమర్పిస్తున్నా సచివాలయ సిబ్బంది

ప్రజాశక్తి - రుద్రవరం: సచివాలయం ఉద్యోగస్తులకు సిబిఎఎస్‌ పరీక్షను ప్రొబేషన్‌కు ముడి పెట్టొద్దని గ్రామ వార్డ్‌ సచివాలయం ఉద్యోగస్తుల సంఘం జిల్లా అధ్యక్షులు రాజేష్‌ ముఖ్యమంత్రికి గురువారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఎలాంటి షరతులు లేకుండా అందరినీ రెగ్యులర్‌ చేయాలని కోరారు. పగిడ్యాల : ఏ ప్రభుత్వ ఉద్యోగులకు లేని సిబిఎఎస్‌ పరీక్షను రద్దు చేయాలని పగిడ్యాల మండల సచివాలయ సిబ్బంది ప్రభుత్వాని కోరారు. స్థానిక ఎంపిడిఒ గౌరిదేవి, డిప్యూటి తహాశీల్దార్‌ జోగన్నకు వినతిపత్రం సమర్పించారు. సచివాయల సిబ్బంది మాట్లాడారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా కృషి చేస్తున్న సిబ్బందికి సిబిఎఎస్‌ పరీక్ష పెట్టడం సరికాదన్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాలు పూర్తి చేసిన సచివాలయ ఉద్యోగులను ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయలని ప్రభుత్వాని కోరారు.