Oct 14,2021 21:54

సచివాలయ ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు

ప్రజాశక్తి - ములకలచెరువు : సచివాలయంలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు సచివాలయంకు గైర్హాజరు కావడంతో షోకాజ్‌ నోటీసులు అందజేసినట్లు ములకల చెరువు ఎంపిడిఒ రమేష్‌ బాబు తెలిపారు. గురువారం ములకలచెరువు మండల కాల్వపల్లి, చౌడ సముద్రం, కోనేటివారి పల్లి గ్రామ సచివాలయాలను ఎంపిడిఒ తనిఖీలు నిర్వహించారు. కాలువపల్లిలో పనిచేస్తున్న సచివాలయం సిబ్బంది ముగ్గురు, కోనేటి వారి పల్లి గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న డిజిటల్‌ అసిస్టెంట్‌ విధులకు గైర్హాజరు అయ్యారు. దీంతో సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజరైన వీరికి షోకేస్‌ నోటీసు అందజేశారు. అనంతరం కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు.