Jul 29,2021 23:30

నన్నూరు సచివాలయంలో మాట్లాడుతున్న ఎస్‌పి

కర్నూలు హాస్పిటల్‌/కర్నూలు క్రైం/ఓర్వకల్లు : కల్లూరు మండలం పెద్దటేకూరు, చిన్నటేకూరు, ఉలిందకొండ గ్రామ సచివాలయాలను కర్నూలు ఎస్‌పి ఎస్‌పి సిహెచ్‌.సుధీర్‌ కుమార్‌ రెడ్డి,  రేంజ్‌ డిఐజి వెంకట్రాంరెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ సచివాలయం లోని సిబ్బందితో ప్రత్యేకంగా మహిళా పోలీసులతో వారి విధుల గురించి చర్చించారు. డిఐజి వెంట లైజన్‌ ఆఫీసర్‌ ఎస్‌ఐ సునీల్‌, ఉలిందకొండ ఎస్‌ఐ శరత్‌ కుమార్‌రెడ్డి సిబ్బంది ఉన్నారు. అలాగే కర్నూలు నగరంలోని ఎన్‌ఆర్‌ పేట, సంకల్భాగ్‌, చిత్తారివీధి వారు , కల్లూరుఅర్బన్‌ పెద్దపాడు, నన్నూరు, తడకనపల్లె, పసుపుల సచివాలయాలను ఎస్‌పి సిహెచ్‌.సుధీర్‌ కుమార్‌ రెడ్డి సందర్శించారు. పెద్దపాడులో ఎస్‌పిని కర్నూలు నగర డిప్యూటీ మేయర్‌ సిద్ధారెడ్డి రేణుక , మాజీ సర్పంచి శ్రీధర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు