Jul 29,2021 21:57

sachivalayam vadda sp


సచివాలయాలను సందర్శించిన ఎస్పీ
మచిలీపట్నం కల్చరల్‌ : సిఎం ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ మచిలీపట్నం పరిధిలోని సుకర్లబాద్‌, బుట్టాయిపేట, రుద్రవరం, గూడూరులోని రెండు సచివాలయాలు మొత్తం కలిపి 5 వార్డు సచివాలయాలను సందర్శించారు. వార్డు సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడారు. వారి దైనందిన విధులు, ప్రజలకు ఎలాంటి సేవలు అందుతున్నాయో ఆరా తీశారు. వార్డు సచివాలయం ఏర్పడ్డాక జరిగిన అభివద్ధిపై అడిగి లుసుకున్నారు. సచివాలయాల పరిధిలో గల మహిళా పోలీసు సిబ్బందితో ఎస్పీ మాట్లాడుతూ విధుల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని,స్థానిక ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ, మహిళలకు, యువతులకు మేమున్నామని భరోసా కల్గించాలన్నారు. ఇంటింటికీ వెళ్ళి ప్రతి ఒక్కరి ఫోన్లో దిశ యాప్‌ ను డౌన్లోడ్‌ చేసుకునేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. వార్డు ఆరోగ్య కార్యదర్శి,చేసే విధులు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఎంత వరకు జరిగింది ఇప్పటివరకు ఎంత పర్సంటేజ్‌ అయింది, ప్రణాళిక నియంత్రణ కార్యదర్శిలు, వార్డు పారిశుద్ధ్య మరియు పర్యావరణ కార్యదర్శిలు వార్డ్‌ హెల్త్‌ సెక్రటరీ, వార్డ్‌ వెల్ఫేర్‌ డెవలప్‌ మెంట్‌ సెక్రటరీలైన వారందరితో మాట్లాడి అక్కడ విధివిధానాల గురించి తెలుసుకున్నారు.మీ ప్రాంత పరిధిలోగల రౌడీషీటర్లు, చెడు నడత కలిగిన వారి యొక్క వివరాలు, మహిళలపై నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ఏదైనా అనుమానం కలిగితే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని, తెలిపారు. మహిళా పోలీసులు కార్యదర్శులు చేస్తున్న విధుల పట్ల ఎస్పీ గారు సంతోషం వ్యక్తపరచి అభినందించారు.ఈ కార్యక్రమంలో బందరు డిఎస్పి మాసుం భాష,దిశా మహిళా పోలీస్స్టేషన్‌ డిఎస్పి రాజీవ్‌ కుమార్‌, పట్టణ సీఐ లు, ఎస్‌ఐలు సిబ్బంది పాల్గొన్నారు.