Oct 19,2021 00:57

స్టీల్‌ప్లాంట్‌ సిఎమ్‌డి అతుల్‌ భట్‌కు వినతిపత్రం అందిస్తున్న కార్పొరేటర్‌ గంగారావు, అయోధ్యరామ్‌

ప్రజాశక్తి-ఉక్కునగరం
స్టీల్‌ ప్లాంట్‌ టౌన్‌షిప్‌లో వార్డు సచివాలయం ఏర్పాటుకు కార్యాలయాన్ని కేటాయించాలని కోరుటూ స్టీల్‌ ప్లాంట్‌ సిఎమ్‌డి అతుల్‌ భట్‌కు 78వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు వినతి పత్రం సమర్పించారు. దీనిపై సిఎమ్‌డి స్పందిస్తూ సచివాలయానికి అవసరమైన భవనాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు గంగారావు తెలిపారు. టౌన్‌ షిప్‌లో మౌలిక సదుపాయాలతో పాటు పారిశుధ్య సమస్యలు, కుక్కల బెడద, పందుల స్వైర విహారం, దోమలతో వ్యాధుల వ్యాప్తి వంటి సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని కోరారు. కేంద్రీయ విద్యాలయం నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని సిఎమ్‌డి దృష్టికి తీసుకెళ్లారు. టౌన్‌ అడ్మిన్‌ సమావేశం ఏర్పాటు చేసి టౌన్‌షిప్‌లోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని సిఎమ్‌డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్టీల్‌ప్లాంట్‌ గుర్తింపు యూనియన్‌ అధ్యక్షులు జె. అయోధ్య రామ్‌, యు.రామస్వామి పాల్గొన్నారు.