
సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న మేయర్ విజయలక్ష్మి
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప్రజలకు ప్రభుత్వ పాలన మరింత చేరువ చేసేందుకు సచివాలయ వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారని మేయర్ విజయలక్ష్మి అన్నారు. గురువారం పూల్ బాగ్ లోని రెండవ నెంబర్ సచివాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ రికార్డులను పరిశీలించారు. ప్రజలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. నైపుణ్యాన్ని మరింత అభివృద్ధి చేసుకొని మెరుగైన పౌర సేవలను అందించాలని కార్యదర్శులకు సూచించారు. మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ రేవతి దేవి, స్థానిక కార్పొరేటర్ బండారు ఆనందరావు ఉన్నారు.