Jan 18,2022 15:39

ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : గ్రామాలలో సచివాలయ ఉద్యోగ శక్తులు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే గృహం వద్ద వివిధ ఎంపీడీవో గీతవాణి, ఈవోపీఆర్డీ జనార్ధన ఆధ్వర్యంలో గ్రామాలలో పనిచేస్తున్న సచివాలయం ఉద్యోగులు పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు, డిజిటల్ సహాయకులకు మొత్తం 264 మందికి ప్రభుత్వం పంపిణీ చేసిన యూనిఫారాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి మాట్లాడుతూ నవరత్నాల్లో భాగంగా గ్రామాలలో సచివాలయంలో ఏర్పాటు చేసిన ఘనత వైయస్ ముఖ్యమంత్రికి దక్కుతుందని ఎమ్మెల్యే అన్నారు. గ్రామీణ ప్రజలకు సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి అందేలా సచివాలయం ఉద్యోగస్తులు కృషి చేయాలన్నారు. గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా సచివాలయంలో పరిష్కరించే దిశగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండలం నాయకులు గుర్నాథ్ రెడ్డి, మాజీ ఎంపిపి పంపాపతి, మాజీ జెడ్పిటిసి ఆనంద్, పెద్దహరివాణం వైసిపి నాయకులు వీరేష్ పాల్గొన్నారు.