Jul 29,2021 22:51

మాట్లాడుతున్న సిఐటియు జిల్లా అధ్యక్షులు యేసురత్నం

ప్రజాశక్తి - కొత్తపల్లి: ఆగస్టు 9న సేవ్‌ ఇండియా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు యేసురత్నం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు స్వాములు, రైతు సంఘం జిల్లా నాయకులు సంజీవ రాయుడు, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రామ్‌ నాయక్‌లు కోరారు. గురువారం కొత్తపల్లిలోని రాజరాజేశ్వరి పాఠశాలలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా సేవ్‌ ఇండియా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. నాయకులు దేవకుమార్‌, పాండు రాజారావు, స్వాములు, హనుమంతు, చెన్నయ్య, జయన్న, ఈశ్వరయ్య, బయన్న పాల్గొన్నారు.