Aug 18,2022 23:11

వాలంటీర్లను సన్మానిస్తున్న ఎంపిపి


ప్రజాశక్తి-డుంబ్రిగుడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను సేవా దృక్పథంతో వాలంటీర్లు ప్రజలకు అందే విధంగా పని చేయాలని స్థానిక ఎంపీపీ బీ.ఈశ్వరి సూచించారు. స్థానిక బాలికల పాఠశాలలో పోతంగి పంచాయతీ గ్రామ వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవ రత్న, సేవ మిత్ర, సేవా వజ్ర అవార్డులను గురువారం మండల ప్రజా ప్రతినిధులు ప్రదానం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సక్రమంగా ప్రజలకు అందే విధంగా గ్రామ వాలంటీర్లు పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సిహెచ్‌ జానకమ్మ, సర్పంచ్‌ ఫోరం మండల అధ్యక్షుడు కే హరి, సర్పంచ్‌ వి.వెంకటరావు, ఓ.సుబ్బారావు, వైసిపి మండల మహిళా అధ్యక్షురాలు బి.శాంతి, ఆ పార్టీ ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.