Jul 29,2021 15:16

ప్రజాశక్తి-కడియం : విపత్కర పరిస్థితుల్లో సేవా కార్యక్రమాలు చేస్తూ తమ సేవానిరతిని చాటుతున్నారు నేటి సామాన్య ప్రజలు. మండలంలోని మురమండ గ్రామం కనకదుర్గమ్మ ఆలయ పూజారి చందన లక్ష్మీ శ్రీనివాస్ ఇటీవల కోవిడ్ సోకి అనంతరం అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబ యజమానిని కోల్పోయి కష్టంలో ఉన్న కుటుంబానికి మురమండ గ్రామ ప్రజలు 1 లక్ష 82 వేలు రూపాయలు గురువారం ఆర్థిక సాయం అందించారు. ఈ విషయం తెలుసుకొని ఇప్పటికే కొందరు వ్యక్తిగతంగా 75 వేలు రూపాయలు అందించారు. గ్రామ ప్రజలతో బాటు వ్యక్తిగతంగా స్పందించి ఆర్థిక సాయం అందించిన ఇతర గ్రామాల వారికి గ్రామ పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ యర్రంశెట్టి వీరబాబు, గ్రామ సర్పంచ్ అయినవిల్లి రుక్మిణీ వెంకటేశ్వరులు, మాజీ సర్పంచ్ లు ఈదర పాపారావు, యర్రా సూర్యనారాయణ, మార్గాని అర్జునుడు, బుడ్డిగ సూరిబాబు, చింతా రాజు, ప్రత్తిపాటి వెంకటరామయ్య చౌదరి, తదితరులు పాల్గొన్నారు.