Jan 14,2022 21:13

న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ సెమీఫైనల్లోకి భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో సహచర షట్లర్‌ అస్మిత చాలిహపై 21-7, 21-18 తేడాలో సునాయస విజయం సాధించింది. కేవలం 36 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 7వ ర్యాంకర్‌ సింధు.. ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. సెమీస్‌ పోరులో సింధు.. ఆరో సీడ్‌ థారులాండ్‌ క్రీడాకారిణి సుపానిడా కేటేథోంగ్‌తో తలపడనుంది.