Nov 20,2020 21:54

లండన్‌: ఏటిపి ఫైనల్స్‌ టోర్నమెంట్‌ సెమీఫైనల్లోకి 2వ సీడ్‌ రఫెల్‌ నాదల్‌ దూసుకొచ్చాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ నిర్ణయాత్మక ఆఖరి గ్రూప్‌ మ్యాచ్‌లో నాదల్‌ 6ా4, 4ా6, 6ా2 సెట్ల తేడాతో స్టెఫనొస్‌ సిట్సిపాస్‌ను చిత్తుచేసి సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్నాడు. స్పెయిన్‌కు చెందిన నాదల్‌ కెరీర్‌లో భాగంగా ఇప్పటివరకూ 86 సింగిల్స్‌, ఓ ఇండోర్‌ హార్డ్‌కోర్ట్‌ టైటిల్స్‌ను గెలుపొందాడు. ఎటిపి టాప్‌ా8 ర్యాంకింగ్స్‌లో ఉన్న ఆటగాళ్లు రెండు గ్రూపులుగా విభజించబడి.. ఒక్కో గ్రూప్‌లో ఆటగాడు మిగిలిన ముగ్గురితో తలపడి ఒక్కో గ్రూప్‌లో టాప్‌ా2లో ఉన్న క్రీడాకారులు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. 34ఏళ్ల నాదల్‌ ఏటిపి ఫైనల్స్‌లో రికార్డుస్థాయిలో 16ఏళ్ల వరుసగా ప్రాతినిధ్యం వహించి, ఆరుసార్లు మాత్రమే సెమీస్‌కు చేరలేకపోయాడు. తొలిరౌండ్‌ మ్యాచ్‌లో రుబ్లేవ్‌పై నెగ్గిన నాదల్‌.. ఆ తర్వాత డోమినిక్‌ థీమ్‌ ఓడాడు.. తాజాగా సిట్సిపాస్‌ను ఓడించి సెమీస్‌కు అర్హత సాధించాడు.
సెమీఫైనల్స్‌..
మెద్వెదేవ్‌(4) × నాదల్‌(2)
థీమ్‌(3) × జకోవిచ్‌(1)
(నోట్‌: బ్రాకెట్లలో ర్యాంకింగ్స్‌)